NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాస‌లీల సీడి కేసు- అజ్ఞాతంలోకి మంత్రి ?

1 min read

బెంగ‌ళూరు: రాస‌లీల‌ల సీడీ కేసు కీల‌క మ‌లుపులు తిరుగుతోంది. సీడీలోని యువ‌తి పోలీసుల ఎదుట‌కు వ‌చ్చింది. కోర్టులో కూడ వాంగ్మూలం ఇచ్చింది. అనంత‌రం సిట్ అధికారులు ఆమెను ప్రశ్నించారు. రెండు చోట్ల ఇచ్చిన‌ వాంగ్మూలంలో మంత్రి ర‌మేష్ జార్కిహొళి.. త‌న‌ను శారీర‌కంగా వాడ‌కున్నాడ‌ని, బెదిరించాడ‌ని ఆ యువ‌తి చెప్పిన‌ట్టు స‌మాచారం. దీంతో ర‌మేష్ జార్కిహొళి అజ్ఞాతంలోకి వెళ్లిన‌ట్టు స‌మాచారం. అరెస్టు త‌ప్పద‌న్న ప‌రిస్థితుల్లో ఆయ‌న ముంబై వెళ్లార‌ని .. ప్రముఖ న్యాయ‌వాదుల‌తో స‌మావేశ‌మై చర్చించ‌న‌ట్టు స‌మాచారం. తాను ఏ త‌ప్పు చేయ‌లేద‌ని, సీడీ వీడియోలన్ని క‌ల్పితాల‌ని చెప్పిన ర‌మేష్ జార్కిహొళి.. బాధిత యువ‌తి అజ్ఞాతం నుంచి బ‌య‌టికొచ్చే స‌రికి.. ఆయ‌నలో అరెస్టు భ‌యం మొద‌లైంది. దీంతో త‌న మీద ఉన్న ఎఫ్ఐఆర్ ర‌ద్దు చేయాల‌ని పిటిష‌న్ వేయ‌నున్నట్టు స‌మాచారం.

About Author