శ్రీ సరస్వతీ శిశు మందిరంలో రథసప్తమి వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలి:శ్రీ సరస్వతీ శిశు మందిరంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా మంగళవారం ఆచార్యులు వాసు మాట్లాడుతూ సూర్యభగవంతుడు జన్మించిన సందర్బంగా ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ శుక్ల షష్ఠి రోజున రథసప్తమి వేడుకలు జరుపుతారని, సూర్య భగవంతుడు 13 పేర్లతో 13 సూర్యనమస్కారాలు 350 చిన్నారుల చేత 15 మంది ఆచార్యుల చేత 13 సూర్యనమస్కారాలు చేపట్టారు. ఈయన ను ఆది దేవుడు అని అంటారు. సూర్యుని వల్ల పంటలు బాగా పండుతాయని, జీవం ఉన్న ప్రతి ప్రాణి కూడ ఈయన వలెనే ఆరోగ్యాంగా జీవిస్తున్నాయ్. ఏడు అశ్వాలను మనం నిత్యం రోజు ఒక్కొక్క రోజుగా పిలుస్తున్నం అవి ఆదివారం నుండి శనివారం వరకు అని పిలుస్తున్నాం అని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.