NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

 శ్రీ సూర్య దేవాలయంలో.. 8న రథసప్తమి వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కర్నూలు నగరంలోని గుత్తి పెట్రోల్​ బంకు వద్దనున్న శ్రీ సూర్య నారాయణ స్వామి దేవాలయం తృతీయ వార్షికోత్సవం మరియు ఈ నెల 8న రథసప్తమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీ అనఘా దత్త జ్ఞాన బోధ సభ ట్రస్ట్​ ఆలయ ఎగ్జిక్యూటివ్​ సభ్యుడు​ టి. శివరామకృష్ణ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి  వారి దివ్య ఆశీస్సులతో ఆలయ తృతీయ వార్షికోత్సవం మరియు రథసప్తమి వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు.  5వ తేదీన గోపూజ, గణపతి పూజ, పుణ్య హవాచనం, రక్షాబంధనం, ఋత్విక్​ వరణము, పంచగవ్య మేళనము, కలశ స్థాపన, మంత్ర పుష్పమ్మ, మహా సరస్వతి హోమం, 6న అభిషేకం, మంత్ర పుష్పము,

7న జగద్గురు పరమ పూజ్య శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి కరకమల సంజాతుల దత్త పీఠం ఉత్తరాధికారి పరమ హంస పరి వ్రాజకాచార్య  శ్రీశ్రీ దత్త విజయానంద తీర్థ స్వాముల వారు దేవాలయం ఆగమనము ఋత్వికులచే పూర్ణకుంభ స్వాగతం ఉంటుందన్నారు.  8న రథసప్తమి వేడుకలు, 9న శ్రీ ఛాయా ఉషా సమత శ్రీ సూర్య నారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం, మధ్యాహ్నం అన్నదానం ఉంటుందని శ్రీ అనఘా దత్త జ్ఞాన బోధ సభ ట్రస్ట్​ ఆలయ ఎగ్జిక్యూటివ్​ సభ్యుడు​ టి. శివరామకృష్ణ వివరించారు. ఆలయ తృతీయ వార్షికోత్సవం, రథసప్తమి వేడుకలకు అశేష భక్తజనం  పాల్గొని స్వామి వారి కృప పొందాలని ఆయన ఆకాంక్షించారు.

About Author