PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్టువ‌ర్టుపురం దొంగ‌పాత్రలో ర‌వితేజ.. ‘టైగ‌ర్ నాగేశ్వర‌రావు’

1 min read

పల్లెవెలుగు వెబ్​ : ర‌వితేజ మ‌రో వైవిధ్యమైన పాత్రను తెర‌కు ప‌రిచ‌యం చేయ‌బోతున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ మీద తెరకెక్కుతున్న ఈ సినిమా వంశీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. స్టూవర్టుపురం పేరుమోసిన గజదొంగ అయిన ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ ఇది. రవితేజ కెరీర్‌లో అత్యంత భారీగా, పాన్ ఇండియా స్థాయిలో రూపొందబోతుంది. ‘ఫీల్ ది సైలెన్స్ బిఫోర్ ది హంట్’ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ విడుదల కానుంది.

About Author