NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అన్నమయ్య జిల్లా రాయచోటి డైట్  ప్రిన్సిపల్, అధ్యాపడిపై సస్పెన్షన్ వేటు

1 min read

అధ్యాపకురాలు వరలక్ష్మి

పల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి: రాయచోటి  డైట్ కాలేజ్  లో ఒక విద్యార్థిని తో అసభ్యంగా ప్రవర్తించిన అధ్యాపకుడు విషయం  ఎవరికైనా  చెపితే చంపేస్తానని బెదిరింపులకు దిగాడు . ఆ విద్యార్థి ని అదే కాలేజ్  మహిళా అధ్యాపకురాలి సాయంతో ప్రిన్సిపల్ కు జరిగిన  సంఘటన ను వివరించడం జరిగింది  ఆ ప్రిన్సిపల్ ఆ అధ్యాపకుడిపై చర్యలు  తీసుకోకపోగా విద్యార్థి ని ని వేరే  ప్రెవేట్ కాలేజ్ అనధికారికంగా పంపడం జరిగింది . అదేవిధంగా  ఆమెకు అండగా నిలిచిన అధ్యాపకురాలు వరలక్ష్మిని ఉద్దేశపూర్వకంగా మారుమూల గ్రామానికి పంపడం జరిగింది . ఇదే క్రమంలో బాధిత మహిళలు మహిళా కమిషన్  సభ్యురాలు గజ్జల లక్ష్మి ని కలిసి న్యాయం  చేయాలని లిఖిత పూర్తికంగా ఫిర్యాదు  ఇవ్వడం  జరిగిందని గజ్జల లక్ష్మి  విషయం  మహిళా కమిషన్ చైర్ పర్సన్  వాసిరెడ్డి పద్మ దృష్టి కి తీసుకెళ్లారు. మహిళా  కమిషన్  విచారణ లో భాగంగా  విద్యాశాఖ  కమీషనర్ కు సమగ్ర విచారణ  జరిపి నివేదిక ను పంపాలని కోరడం జరిగిందని   విచారణ ను రాయలసీమ  రీజనల్ జాయింట్ డైరెక్టర్ (RJD )వారి  ఆధ్వర్యంలో విచారణ చేయడం జరిగిందని,  తప్పు చేసిన వ్యక్తి ని తప్పించినందుకు పై అధికారుల దృష్టి కి తీసుకెళ్లనందుకు ప్రిన్సిపల్ ను సస్పెన్షన్  చేసి విద్యా శాఖ కమీషనర్ చర్యలు  తీసుకోవడం జరిగింది. అలాగే విద్యార్థిని పట్ల  అసభ్యంగా ప్రవర్తించిన అద్యాపకుడిని కూడా  సస్పెన్షన్  విధించడం జరిగిందని మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి  మీడియా కు వెళ్లడించారు. ప్రభుత్వం లోని అధికారులు మహిళల పట్ల దాడులు చేసిన వారిని ఉపేక్షించరని మహిళలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి  గారు కొండంత అండగా నిలిచారని మహిళా కమిషన్  తరుపున విద్యాశాఖ కు ధన్యవాదాలు  తెలిపారు.

About Author