రాయలసీమ ప్రయోజనాలు తాకట్టు పెట్టారు : కాల్వ
1 min readపల్లెవెలుగు వెబ్ : సీఎం జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. ఎన్నికల ముందు కేసీఆర్ తో చేసుకున్న రహస్య ఒప్పందం మేరకే సీమ ప్రయోజనాలు తాకట్టు పెట్టారని ఆరోపించారు. తెదేపా హయాంలో 8 వేల కోట్లు పైగా హంద్రీనీవాకు ఖర్చు చేశామని, వైకాపా అధికారంలోకి వచ్చాక ఎంత ఖర్చపెట్టారో చెప్పే దమ్ము వైసీపీ నేతలకు ఉందా ? అని ప్రశ్నించారు. అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే జలవివాదం డ్రామాలు అడుతున్నారని విమర్శించారు. వైకాపా ప్రభుత్వ అసమర్థత వల్లే పోలవరం నిర్మాణం పూర్తీ చేయలేకపోతున్నారని, జగన్ సీఎంగా ఉన్నంత వరకు గ్రావిటీ ద్వార నీరు పారించే పరిస్థితి ఉండదన్నారు.