రాయలసీమ హక్కులు అడిగితే అక్రమ అరెస్టులా..??
1 min readరాయలసీమ ఉద్యమనేత బొజ్జ దశరధ రామిరెడ్డి అక్రమ అరెస్టు అప్రజాస్వామికం.
రవికుమార్, రాష్ట్ర అధ్యక్షులు,ఆర్వీపీఎస్.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: నగరంలోని ఏ క్యాంపులో గల రాయలసీమ విద్యార్థి పోరాట సమితి కార్యాలయంలో రాయలసీమ విద్యార్థి పోరాట సమితి, రాయలసీమ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ రాయలసీమ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సుంకన్న, ఆర్వీపీఎస్ జిల్లా అధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ నంద్యాల నగరంలో రాయలసీమ ఉద్యమ నాయకుడు బొజ్జ దశరధ రామిరెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు 2016లో రాయలసీమ నీటి హక్కుల పోరాటంలో భాగంగా సిద్దేశ్వరం అలుగు నిర్మాణం చేపాట్టాలని కోరుతూ రాయలసీమ సాగునీటి సాధన సమితి, రాయలసీమ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారని సిద్దేశ్వరం అలుగు నిర్మాణం కోరుతూ ప్రతి సంవత్సరం రాయలసీమ సంఘాలు అనేక కార్యక్రమాలు,శాంతియుత నిరసనలు చేస్తున్న సిద్దేశ్వరం అలుగు నిర్మాణం రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం రాయలసీమ నీటి అవసరాలు పట్టని ప్రభుత్వాలు రాయలసీమ హక్కులు అడిగిన నాయకులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయడమేమిటని వారు ప్రశ్నించారు గత ప్రభుత్వంలో రాయలసీమ హక్కుల పోరాటాలలో పాల్గొని మద్దతు తెలిపిన వైసీపీ నాయకులు ఇప్పుడు అవే హక్కుల అడిగితే ఉద్యమకారులను ఇబ్బందులకు గురిచేయడమన్నది మంచి చర్య కాదన్నారు.తక్షణమే రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరధ రామిరెడ్డిని విడుదల చేసి గతంలో అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో గూడూరు సురేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.