రాయలసీమకు అన్యాయం చేస్తే సహించేది లేదు
1 min read– రాష్ట్రాల మధ్య గొడవ పెడుతున్న బిజెపి సిపిఐ మండల కార్యదర్శి. డి.రాజా సాహెబ్ ఆగ్రహం
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: కర్ణాటక లోని అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణం చేపడితే రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల కార్యదర్శి డి.రాజా సాహెబ్ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పత్తి కొండ సిపిఐ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023 24 బడ్జెట్ లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు అధిక నిధులు కేటాయిస్తూ కర్ణాటక లోని భద్ర ప్రాజెక్టు నిర్మాణానికి 5300 కోట్ల రూపాయలు నిధులు కేటాయించిందని భద్ర ప్రాజెక్టులు మొదటి రెండు దశలో పూర్తి అయితే తుంగభద్ర నుండి వచ్చే నీరు దిగువకు రాకుండా ఆగిపోయి దీని వలన రాయలసీమకు రావలసిన కేటాయించిన నీళ్ళు రావన్నారు దీంతో రాయలసీమ నీళ్లు లేక బీడు భూములు ప్రమాదం పొంచి ఉందన్నారు. కర్ణాటక నా నదిలో కేటాయించిన నీటి వాటా కంటే ఎక్కువ వాడుకుంటూ ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచే ప్రయత్నం కూడా చేస్తుందని దీనివలన దిగువ రాష్ట్రానికి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని అవేదం వ్యక్తం చేశారు. బ్రిజేష్ కుమార్ ఇచ్చిన తీర్పులను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో బిల్లు వేసిన వివాదాలు పరిష్కరించుకోకుండా అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర బడ్జెట్ అధిక నిధులు కేటాయిస్తున్నారంటే ఇది కేవలం ఎన్నికల ఎత్తుగడలో భాగం అన్నారు కేంద్ర ప్రభుత్వం నదీ జలాల సమస్యలు పరిష్కారం చేసే విధంగా ఉండాలి కానీ ఇప్పటికే తుంగభద్ర నుండి హెచ్ ఎల్ సి. ఎల్ ఎల్ సి కాల్వ పూడిక వల్ల న్యాయపదం రావలసిన నీళ్లు రాకపోగా పై భాగాన మోటర్ పెట్టి నీళ్ల. కొట్టడం ద్వారా కింద ఉన్న రైతులు ఇప్పటికే నష్టపోతున్నారని కింద ఉన్న ఆంధ్రప్రదేశ్లో కర్నూల్ దగ్గర గుండ్రేవుల ప్రాజెక్టు కి నిర్మాణం జరగకుండా గండి కొట్టే ప్రమాదం దాపరిచిందని వారు ఆవేదన చెందారు. రెండు రాష్ట్రాల మధ్య గొడవ పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని, ఈ గొడవ ద్వారా రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో లబ్ది పొందాలనే బీజేపీ ఉద్దేశం అన్నారు . తక్షణమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జోక్యం చేసుకొని రాయలసీమకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు లేనిపక్షంలో ఆందోళన చేపట్టక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ మండలసహాయ కార్యదర్శి ఎచ్.రంగన్న సిపిఐ పట్టణ కార్యదర్శి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.