R&B , NH -40 నేషనల్ హైవే అధికారులు నిర్లక్ష్యం వీడాలి
1 min readSFI, AIFB
పల్లెవెలుగు వెబ్ గడివేముల: పాణ్యం గ్రామం లోకి బస్టాండ్ నుండి గ్రామం లోకి వెళ్లే రహదారి వెడల్పు చేయాలి. అలాగే జిల్లా పరిషత్ హై స్కూల్ యొక్క స్థలం 0.54 సెంట్లు నేషనల్ హైవే లో వెళ్లిందని.ఆ స్థలంలో కూడా రకరకాల షాపులు కేటాయించుకొని స్థలం అమ్ముకొనుటకు ప్రయత్నిస్తున్నారని రెండు రోజుల కిందట గ్రౌండ్లో లో కంచె సగం వేసి మిగతా సగం వేయకుండా వదిలి పెట్టడం వలన విద్యార్థులు కు ప్రజలకు రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని. ఈ విషయం పైన పలుమార్లు గ్రామ పంచాయతీకి ఎంఈఓకి, ఎమ్మార్వోకి తెలియజేసిన ఫలితం శూన్యం అందుకని ఈరోజు స్పందన కార్యక్రమంలో నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చినట్టు ఆర్ & బి, నేషనల్ హైవే అధికారులునిర్లక్ష్యం వీడి తొందరలోస్కూల్ చుట్టూ ఉన్న షాపులు తొలగించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలనికోరుతూ, నేషనల్ హైవే లో రహదారి కొరకు పోయినటువంటి 0.54 సెంట్లల లో స్థలాన్ని షాపులు వేసుకోకుండా, స్థలాన్ని ఎవరు ఆక్రమించకుండా రహదారి కొరకుచూడాలని విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు SFI,,AIFB ప్రతాప్, వనం వెంకటాద్రి కోరారు.