PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కూచంపూడి ఆర్ అండ్ బి రహదారి కి మోక్షం..

1 min read

30 ఏళ్ల కల నెరవేర్చిన ఎమ్మెల్యే

అబ్బయ్య చౌదరికి

నీరాజనాలు పలుకుతున్న పరిసర గ్రామ ప్రజలు, వాహనదారులు, రైతులు

అభివృద్ధికి దిక్సూచి అబ్బయ్య చౌదరి

పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి : పెదవేగి మండలం మరియు ఆయాగ్రామాల ప్రజలు 30ఏళ్లుగా ఎదురు చూస్తున్న కలను స్థానిక దెందులూరు ఎం ఎల్ ఏ కొటారు అబ్బయ్యచౌదరి 2024 నాటికి నెరవేర్చారు. గోపన్నపాలెం నుండి పెదవేగి.కూచింపూడి.రామసింగవరం వరకు గల ఆర్ అండ్ బి రహదారి అభివృద్ధికి దూరమై సుమారు 30 ఏళ్ళు ఆవుతుంది. అప్పటి నుండి ఈ రహదారి అభివృద్ధిని పట్టించుకున్న నాధుడే లేడు. గుంతలు, గోతులుతో ద్విచక్ర వాహనదారులు, వ్యవసాయ సంబంధిత వాహనాలతో ఆ రహదారులు తూట్లు తూట్లు గా పాడైపోయిoడి. ఈ రోడ్డు లో ప్రయాణించాలంటే ప్రజలు నరకం చూసేవాళ్ళు. ఆటోలు.కిరాయి కారులు ఈ రోడ్డులో కిరాయికి రావాలంటే అష్ట కష్టాలుపడే వారు. అప్పట్లో నియోజక వర్గానికి ఎం ఎల్ ఏ లుగా ప్రాతినిధ్యం వహించిన ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు ప్రజలు ఈ రహదారి నిర్మించి పుణ్యం కట్టుకోండి బాబూ అంటూ ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ఫలితం శూన్యమైంది. రామసింగవరం .బాదరాల గ్రామప్రజలు అప్పటి పాలకులకు ఎన్నో దపాలు వినతి పత్రాలు అందించినా ఫలితం లేకుండా పోయింది. ఒకరిద్దరు ఎం ఎల్ ఏ లు  తమ హాయాం లో నైనా ఈ రోడ్డు నిర్మాణం ఎలాగైనా చేపట్టాలని చేసిన కృషిఫలించలేదు. రామసింగవరం నుండి బాదరాల బోర్డర్ వరకు ఆర్ అండ్ బి పరిధిలో లేదని ఒకరు. ఈ బిట్టు జంగారెడ్డిగూడెం ఆర్ అండ్ బి డివిజన్ పరిధిలో ఉందని మరి కొందరు. అవన్నీ కాదు రామసింగవరం విద్యుత్ సబ్ స్టేషన్  నుండి బాదరాల బోర్డర్ వరకు రిజర్వ్ పారెస్టు  రికార్డుల్లో ఉందని సాకులతో కాలతీతం అయ్యింది. ఈ రోడ్డు నిర్మాణం చేస్తే బిల్లులు రావని కొందరు ఇలా రకరకాలుగా కారణాలు చూపి  30 ఏళ్ళు గా రహదారి అభివృద్ధి చేయలేకపోయారు. ప్రస్తుత దెందులూరు ఎం ఎల్ ఏ కొటారు అబ్బయ్యచౌదరి 2019 ఎన్నికల బరిలోకి తొలిసారిగా అడుగుపెట్టిన అబ్బయ్యచౌదరి ఎన్నికల ప్రచారానికి రామసింగవరం లో అడుగు పెట్టగానే ప్రజలు రహదారి దుస్థితి వివరించారు. వెంటనే స్పందించిన అబ్బయ్యచౌదరి ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈ రహదారి నిర్మాణం చేస్తాను అని అప్పట్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. లింగపాలెం మండలం బాదరాల.పెదవేగి మండలంరామసింగవరం.కూచింపూడి. పెదవేగి. లక్ష్మీపురం   గోపన్నపాలెం. గ్రామాల ప్రజలు అభివృద్ధికి దిక్సూచిగా అబ్బాయి చౌదరి నిలిచారని దెందులూరు ఎం ఎల్ ఏ అబ్బయ్యచౌదరి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

About Author