క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
1 min read
పల్లెవెలుగువెబ్: క్రిప్టో కరెన్సీతో దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి పెను ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆందోళన వ్యక్తం చేశారు. వర్చువల్ కరెన్సీలతో భవిష్యత్తులో దేశానికి తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయని అభిప్రాయపడ్డారు. వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో క్రిప్టో కరెన్సీపై కేంద్ర ప్రభుత్వం ఓ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. క్రిప్టో కరెన్సీ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఏమేరకు ఉంటుందన్న దానిపై విస్తృతంగా చర్చలు జరగాలన్నారు. క్రిప్టో కరెన్సీ ఖాతా తెరవడానికి రుణాలతో పాటు ట్రేడింగ్‌కు ఏకంగా ప్రోత్సాహకాలే ఇస్తున్నారని.. ఖాతాల సంఖ్య పెరగడంతో వర్చువల్ కరెన్సీల్లో ట్రేడింగ్, లావాదేవీల విలువ పెరుగుతుందని.. దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్ పేర్కొన్నారు.