ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీఓ
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మండల పరిధిలోని నాగలూటి గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిని ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం.దాసు పరిశీలించారు.నాగలూటి గ్రామంలో పిరమిడ్ ధ్యాన కేంద్రం మరియు వృద్ధాశ్రమం నిర్మించుటకు గాను ప్రభుత్వ భూమి రెండు ఎకరాలను చూపించవలసిందిగా గ్రామ సర్పంచ్ ఉషారాణి మరియు సంస్థ ప్రతినిధులు ఆధ్వర్యంలో ఆర్డీవో కు వినతిపత్రాన్ని అందజేశారు. ఇక్కడ ప్రాంతం సువిశాలంగా అందరికీ అనుకూలంగా ఉన్నందున ఇక్కడే స్థలం చూపించాలని ఆర్డీవో కు సంస్థ ప్రతినిధులు విన్నవించారు. అందుకుగాను ఆర్డీవో ప్రభుత్వ భూమిని పరిశీలించారు.పైఅధికారుల దృష్టికి తీసుకువెళ్తానని ఆయన తెలిపారు.ఈకార్యక్రమంలో వైస్ ఎంపీపీ నబి రసూల్,సహకార సొసైటీ చైర్మన్ తులసిరెడ్డి,తహసిల్దార్ సిరాజుద్దీన్ మరియు సంస్థ ప్రతినిధులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.