సిలువ యాగంను ప్రారంభించిన ఆర్డిఓ మిరియాల దాసు
1 min readపల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: ఆత్మకూరు శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆత్మకూరు పట్టణం నందు గల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి ఈ కార్యక్రమమును ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీస్తు బోధనలు ప్రేమ దయ, దీర్ఘశాంతము కరుణ,జాలి,ఇవి మనిషిని మరింత ఉన్నతంగా మారుస్తాయని ప్రతి ఒక్కరు ఇవి కలిగి ఉండాలని ఆయనకోరారు. ఈ కార్యక్రమాన్ని ఆత్మకూరు సీఎస్ఐ చర్చ్ డీనరీ చైర్మన్ నల్లమల జాన్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు త్యాగరాజు ఏసుక్రీస్తు యొక్క శిలువ దృశ్యాన్ని ప్రదర్శించాడు, డిన్నరీ చైర్మన్స్ త్యాగరాజు, రాజేంద్ర బాబు,పాస్టర్స్ జయరాజు, సంపూర్ణ రావు లిటిల్ ఏంజెల్ స్కూల్ కరస్పాండెంట్ ఇమ్మానుయేలు, శీలం శేషు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమము ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి గౌడ్ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా సీఎస్ఐ చర్చ్ ఇంద్రానగర్ వరకు సాగింది.