PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్డీవో కార్యాలయం ముట్టడి ….    

1 min read

– పేదల కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆర్డీవో కార్యాలయం ముట్టడి      రియల్ ఎస్టేట్ వెంచర్లో సిసి రోడ్లు డ్రైనేజీ కాలువ ఏర్పాటు చేసి, పేదల నివాసం ఉంటున్న కాలనీలో సిసి రోడ్లు డ్రైనేజీ కాలువలు ఏర్పాటు.  చేయకపోవడం ఆంతర్యం ఏమిటని ప్రశ్నించిన సిపిఐ సిపిఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య      పేదల పేరుతో జగనన్న కాలనీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న అధికార పార్టీ వారికి తొత్తులుగా మారుతున్న రెవెన్యూ  అధికారులు బి.గిడ్డియ్య విమర్శ.

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:   పత్తికొండ పట్టణంలోని పేదలు నివసిస్తున్న కాలనీలు వి.కె.ఆదినారాయణ రెడ్డి నగర్, దిడ్డి చేను కొట్టాలకాలని,పార్వతి కొండ కొట్టాల కాలనీ, నల్లగుట్ట కాలనిలలో కనీస మౌలిక సదుపాయాలు డ్రైనేజీ కాలువలు సిసి రోడ్లు ఇంటి పట్టాలు ప్రభుత్వం పక్కా ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో శనివారం   స్థానిక చదువులు రామయ్య భవన్ నుంచి ర్యాలీగా వచ్చి ఆర్డిఓ కార్యాలయం ముట్టదించారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం నబి రసూల్, సిపిఐ మండల కార్యదర్శి డి రాజా సాహెబ్ మాట్లాడుతూ, పత్తికొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, అధికార పార్టీ వారికి చెందిన రియల్ ఎస్టేట్ వెంచర్లలో  డ్రైనేజీ కాలువలు, సిసి రోడ్లు ఏర్పాటు చేస్తున్న అధికారులు పేదలు నివాసముండే కాలనీలలో ఎందుకు మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని ప్రశ్నించారు. ఎలాంటి సదుపాయాలు లేని కాలనీల్లో పదుల సంవత్సరాల్లో నివాసముంటున్న పేదలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోగా స్థలాలకు పట్టాలు ఇచ్చి పక్కా గృహాలు మంజూరు చేయకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు.  జగనన్న కాలనీల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ వారికి క్షణాల్లో పట్టాలు మార్పులు చేసే రెవెన్యూ అధికారులు పేదలకు పట్టాలు ఇవ్వాలంటే మనసు రాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.  రెవిన్యూ డివిజనల్ కేంద్రమైన పత్తికొండ పట్టణంలోని పేదల కాలనిలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలక ప్రభుత్వలు విఫలం చెందాయన్నారు. పత్తికొండ పట్టణంలో సీపీఐ ఆధ్వర్యంలో భూ పోరాటాలు ద్వారా ఆక్రమణతో పట్టణంలోని పేదవారికి ఇళ్ళ స్థలాలు పంపిణీ చేసి స్థానికంగా వి. కె. ఆదినారాయణ రెడ్డి నగర్, దిడ్డి చేను కొట్టాల కాలనీ, పార్వతి  కొండ కొట్టాల కాలనీ, నల్లగుట్ట కాలనీలను ఏర్పాటు చేశామన్నారు. పట్టణంలో దాదాపు 15 సంవత్సరాల నుంచి పేదవారు ఆయా కాలనీలలో  కొట్టాలు వేసుకుని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. అయితే ప్రభుత్వం ఆయా కాలనీలలో కనీస మౌలిక సౌకర్యాలు నేటికీ కల్పించలేదని వాపోయారు.  కనీస సౌకర్యాలు  సి. సి. రోడ్లు, మురుగు కాలువలు,విద్యుత్ తదితర సౌకర్యాలు లేక మోకాలి లోతు గుంతలపడి ఆ గుంతలలో పడి ముసలి వాళ్లు, పిల్లలు గాయాల పాలవుతున్నారని అన్నారు. గుంతలలో మురికి నీరు  ఆగి దుర్వాసనతో, దోమలు వ్యాప్తి చెంది దోమ కాటుకు గురై అనారోగ్యం పాలై ప్రాణాంతక రోగాలతో హాస్పిల్లలో చేరుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పేదలు నివాసం ఉండే కాలనిలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించి, కాలనీలో విద్యుత్ సౌకర్యం, ఇళ్ల స్థలాలకు పట్టాలు, పక్కా ఇల్లు మంజూరు చేయాలని వారు కోరారు.గత 15సంవత్సరాలుగా  వివిధ రూపాల్లో సీపీఐ ఆధ్వర్యంలో  ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వం దృష్టికి తెచ్చినా  ప్రయోజనం లేకపోయిందన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు ఆ కాలనీ ప్రజల  పట్ల విపక్ష చూపిస్తూ అంటరాని కాలనీలుగా చూస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే 15 రోజుల్లో పేదలతో కలిసి సిపిఐ రిలే నిరాహార దీక్షలు, ప్రభుత్వ కార్యాలయం ముట్టడి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారుహెచ్చరించారు.  సిపిఐ పట్టణ కార్యదర్శి రామాంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో  సిపిఐ జిల్లా సమితి సభ్యులు బి సురేంద్ర కుమార్, దళిత  హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు ఆర్ గురుదాస్, మండల సిపిఐ సహాయ కార్యదర్శి ఎం రంగన్న, ఎఐటియుసి తాలూకా అధ్యక్షులు నెట్టికంటయ్య,  ఏఐవైఎఫ్ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు పెద్దయ్య, అన్వేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు అల్తాఫ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు రమేష్, సిపిఐ ప్రజాసంఘాల నాయకులు గుండు బాషా, మాదన్న, శ్రీనివాసులు,  జోలాపురం కాశి, రాజప్ప, రామాంజినమ్మ, కౌలుట్ల, రవి, అశోక్, భాష, ఆనంద్ తో పాటు భారీగా కాలనీల మహిళలు, సిపిఐ శ్రేణులు పాల్గొన్నారు.

About Author