PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చుక్కల భూములను పరిశీలించిన ఆర్డివో

1 min read

పల్లెవెలుగు , వెబ్​ చెన్నూరు: మండలంలోని రుద్ర భారతి పేట, దుగ్గన పల్లె గ్రామ పొలాలలో చుక్కల భూములను ఆర్డిఓ ధర్మ చంద్రారెడ్డి శుక్రవారం పరిశీలించారు, అనంతరం ఆయన స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్ డి ఓ ధర్మ చంద్ర రెడ్డి మాట్లాడుతూ, రుద్ర భారతి పేట లోని 9, 10 సర్వే నెంబర్లలో గల కన్వర్షన్ భూమిని ఆయన పరిశీలించి నట్లు తెలిపారు, ఇందులో 9వ సర్వేనెంబర్ లో నాలుగు ఎకరాల పది సెంట్లు, అదేవిధంగా 10 సర్వే నెంబర్లు మూడు ఎకరాల 14 సెంట్లు చుక్కల భూమి 2021లో పట్టా గా మార్చినట్లు తెలియజేశారు, అదేవిధంగా దుగ్గన పల్లి పొలంలోని సర్వే నెంబర్ 222 /3బి లో మూడు ఎకరాల 56 సెంట్లు, 217/2 లో రెండు ఎకరాల 5 సెంట్లు 223/4 బి లో ఎకరా 15 సెంట్లు భూమిని పరిశీలించడం జరిగిందని ఆయన తెలిపారు, ఇందులో రుద్ర భారతి పేట కు సంబంధించిన భూమి కి భూమి యజమానులు ఫీజులు చెల్లించి అగ్రికల్చర్ నుండి వ్యవసాయేతర భూమిగా మార్పు చేయడం జరిగిందని తెలియజేశారు, అంతేకాకుండా మండలంలో రాచినాయ పల్లి, ముండ్ల పల్లి గ్రామ పంచాయతీలలో జరుగుతున్న జగనన్న భూ రక్ష, భూ సర్వే లో భాగంగా రైతులను పిలిపించి వారి సమక్షంలోనే వారికి సంబంధించిన భూములను సర్వే చేసి వారి సరిహద్దు లు తెలియజేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు, ఇందులో ముండ్ల పల్లె పంచాయితీ పరిధిలో లో 6 వందల 40 ఎకరాలు, అలాగే రాచి నాయ పల్లె కు సంబంధించి 6 వందల 80 ఎకరాలు సర్వే నిర్వహించడం జరిగిందన్నారు, ఇంకా వేగవంతంగా సర్వే నిర్వహించాలని, అనుకున్న వ్యవధిలో పనులు పూర్తి చేయాలని ఆయన సర్వేర్ సోమశేఖర్ కు సూచించారు, అదేవిధంగా చెన్నూరు ఖిల్లా మసీదు కు సంబంధించిన భూమి స్థలంలో సచివాలయం -3 నిర్మాణం చేపట్టడం, దానికి సంబంధించి కొంత మంది అది మసీదు కు సంబంధించిన భూమి అని హైకోర్టును ఆశ్రయించడం జరిగింది, దీంతో అక్కడ చేపట్టిన సచివాలయ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి, దీనికి సంబంధించిన ఫైలును తాసిల్దార్ కార్యాలయంలో ఆర్ డి ఓ పరిశీలించారు, అయితే ఈ భూమి కి సంబంధించి సర్వే నెంబర్ 729 లోఒక1ఎకరా54 సెంట్లు,అలాగే1ఎకరా 78 సెంట్ల భూమి 1962లో, అలాగే 1967లో కొంతమంది ట్రస్టుగా ఏర్పడి కోర్టు నుండి ట్రాన్స్ఫర్ గా పర్మిషన్ తీసుకుని అమ్ముకోవడం జరిగిందన్నారు, దానికి సంబంధించి వక్ఫ్ బోర్డు కోర్టును ఆశ్రయించిన పోవడంతో ఆ భూమికి సంబంధించి ముగ్గురు పేర్లమీద అమ్మకం మీద ట్రాన్స్ఫర్ అయినట్లు ఆయన తెలిపారు, అంతేకాకుండా ఇప్పుడు మా భూమి వక్ఫ్ బోర్డు సంబంధించిందని కొంతమంది కోర్టు వెళ్లడం జరిగిందని, ఆయన తెలిపారు కోర్టుల ఆదేశానుసారం మా భూమి ఎవరికి సంబంధించిన భూమి అని నిర్ధారణ చేస్తే వారికి సంక్రమిస్తుందని ఆయన తెలియజేశారు, అలాగే కొంతమంది నిరుపేదలకు డికెటి భూములు ప్రభుత్వం ఇచ్చినప్పటికీ వాటిని వ్యవసాయ భూములుగా వాడుకోకుండా, వ్యవసాయేతర భూములుగా మలుచుకున్న వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో తాసిల్దార్ పటాన్ అలీ ఖాన్, సర్వేయర్ సోమశేఖర్, విఆర్వో శ్రీనివాసులు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

About Author