రీ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
1 min read
లోపాలకు తావు లేకుండా రీ సర్వే పూర్తి చేయాలి
మాదేపల్లిలో రీసర్వే ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ కె.వెట్రిసెల్వి
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏటువంటి లోపాలకు తావు లేకుండా రీ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి గ్రామంలో పైలెట్ ప్రాజెక్టుగా నిర్వహిస్తున్న రీసర్వేను కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆకస్మికంగా పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రీసర్వే ఎంత మంది చేస్తున్నది, ఎన్ని ఎకరాలు చేస్తున్నారు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. రీసర్వే చేసే భూముల్లో ముందుగా రైతులకు నోటీసులు ద్వారా తెలియజేస్తుంది లేనిది ఆరా తీశారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, చిన్న తప్పు కూడా ఆస్కారం లేకుండా రీసర్వే పూర్తి చేయాలన్నారు. మాదేపల్లి గ్రామాన్ని ప్రభుత్వం రీసర్వే ప్రాజెక్ట్ పైలేట్ గా ఎంపిక చేయడం జరిగింది. గ్రామంలో 1507 ఎకరాల 98 సెంట్లు భూమి ఉండగా దానిని రీ సర్వే 6 బ్లాక్స్ 250 ఎకరాలు వచ్చేటట్లుగా విభజించి రీ సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. భూమి విస్తీర్ణంలో వ్యత్యాసాలపై వచ్చిన కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఈ సందర్బంగా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట ఏలూరు ఆర్డిఓ అచ్యుత్ అంబరీష్, తహశీల్దారు శ్రీనివాస్, రీ సర్వే డిటి నాగమణి, పంచాయితీ సెక్రటరీ సుమతీ, గ్రామ సర్వేయర్లు, మండల సర్వేయర్లు, రైతులు పాల్గొన్నారు.