NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహానంది మండలంలో ప్రారంభమైన రీ సర్వే

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది :  మండలం లోని బొల్లవరం, గోపవరం గ్రామంలో రెండవ విడత రీ సర్వే ప్రారంభమైంది. రెండు రోజుల నుంచి రైతుల సమక్షంలో పంట పొలాలను రీ సర్వే చేస్తున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకుని రావాలని ఏదైనా సమస్య ఉంటే సరైన పత్రాలు చూపించాలని బొల్లవరం గ్రామ వీఆర్వో చలమయ్య రైతులకు సూచించారు. ఇక్కడ పరిష్కారం కానివి తాసిల్దార్ కు తెలియజేస్తామన్నారు. సర్వేయర్లు రోవర్ ద్వారా పంట పొలాలను సర్వే చేస్తున్నారు. దీంతోపాటు రెవెన్యూ రికార్డులను అందుబాటులో ఉంచుకొని పరిశీలిస్తున్నట్లు సర్వేర్లు తెలిపారు. రీ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సందర్భంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్వే చేస్తున్నట్లు తెలిపారు. బొల్లవరం గ్రామ పరిధిలో ఇప్పటివరకు దాదాపు 3 20 ఎకరాల పైననే సర్వే చేసినట్లు తెలిపారు. సర్వే అనంతరం వివరాలను అధికారులకు నివేదిక సమర్పిస్తామన్నారు. అనంతరం రైతులకు నూతన పట్టాదారు పాసుపుస్తకాలు రైతులకు సంబంధిత అధికారులు అందజేయడం జరుగుతుంది అన్నారు. సర్వేయర్లు ఉషేనయ్య, వెంకట కృష్ణుడు, పార్థసారథి, పవన్ మరియు గ్రామ తలార్లు పాల్గొన్నారు .

About Author