NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉపాధి అవకాశాలతో ఉన్నత స్థాయికి చేరుకోవాలి

1 min read

– కాటసాని రాంభూపాల్ రెడ్డి,పాణ్యం ఎమ్మెల్యే,
– బివై రామయ్య,మేయర్
పల్లెవెలుగు వెబ్ కల్లూరు : యువత ఉపాధి అవకాశాలతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని పాణ్యం ఎమ్మెల్యేకాటసాని రాంభూపాల్ రెడ్డి,మేయర్ బివై రామయ్యలు ఆకాంక్షించారు.ఆదివారం నగరంలోని బిర్లా కాంపౌండ్,సాయి వసంత్ కాంప్లెక్స్ నందు అరుణా రెడ్డి, సాయి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో టంబుల్ డ్రై క్లీనర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటుచేశారు. కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి,మేయర్ బివై రామయ్య,డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక హాజరయ్యారు.ఈ సందర్బంగా వారు మాట్లాడారు.యువత ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అదునాతన పద్ధతులతో దుస్తులు డ్రైక్లీనింగ్ వల్ల దుస్తులకు రక్షణగా ఉండి,అధిక కాలం మన్నికతో ఉంటాయని అన్నారు. ఇలాంటి చిన్న తరహా పరిశ్రమలను అవగాహనాతో కృషి చేస్తే మంచి భవిష్యత్ ఉంటుందని వారు తెలిపారు.యజమాని అరుణా రెడ్డి మాట్లాడుతూ దుస్తులు డ్రైక్లీనింగ్ చేయడం వల్ల మరకలు తొలగిపోతాయని అన్నారు.అలాగే మంచి షైనింగ్ తో ఆకర్షణగా ఉంటాయని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సుదర్శన్ రెడ్డి,వైసీపీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

About Author