పట్టుదలతో “చదివి” ఉన్నత స్థాయికి చేరుకోవాలి!
1 min read
ఎంఎస్ ఎడ్యుకేషనల్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ సయ్యద్ హమీద్
పత్తికొండ, న్యూస్ నేడు: నిరుద్యోగులు మరియు విద్యార్థులు పట్టదలతో బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడే మంచి గుర్తింపు ఉంటుందని హైదరాబాద్ ఎంఎస్ ఎడ్యుకేషనల్ అకాడమీ డైరెక్టర్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత డాక్టర్ సయ్యద్ హమీద్ తెలిపారు. బుధవారం పత్తికొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యువ స్పందన సొసైటీ ఆధ్వర్యంలో పోటీ పరీక్షల్లో ఇంగ్లీషు సబ్జెక్ పై మెళుకువలు మరియు పరీక్ష సన్నదతకు మోటివేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఎస్ ఎడ్యుకేషనల్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ సయ్యద్ హమీద్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నిరుద్యోగులు మరియు విద్యార్థులు తెలుగు భాషతో పాటు ఇంగ్లిష్ భాషపై కూడా పట్టు సాధించాలని, అప్పుడే పోటీ పరీక్షల్లో రాణించగలరని తెలిపారు. ప్రస్తుత కాలంలో పోటీ పరీక్షలలో పోటీతత్వం పెరిగి పోతుందని, అందువల్ల పట్టుదలతో బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంగ్లిష్ భాషపై ఎక్కువగా భయం ఉంటుందని, ఆ భయాన్ని వీడి ధైర్యంతో ముందుకు అడుగు వేయాలని వివరించారు. పత్తికొండ యువ స్పందన సొసైటీ ఆధ్వర్యంలో ఇలాంటి మోటివేషన్ కార్యక్రమాలు చేపట్టడం వల్ల విద్యార్థులకు చాలా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ మోటివేషన్ కార్యక్రమంలో నిరుద్యోగులు మరియు విద్యార్థులకు ఇంగ్లీష్ పై సందేహాలను డాక్టర్ సయ్యద్ హమీద్ నివృత్తి చేశారు. అనంతరం ముఖ్యఅతిథి డాక్టర్ సయ్యద్ హమీద్ మరియు రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ అధికారి సింగర్ శివయ్య, ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు వీరేశప్పలను యువ స్పందన సొసైటీ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో యువ స్పందన సొసైటీ ఉపాధ్యక్షులు లక్ష్మన్.
