వాటర్ ప్లాంట్ల మీద దాడులకు సిద్ధం..?
1 min readపల్లెవెలుగు వెబ్: రాష్ట్రంలో అనధికారంగా నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్ల మీద దాడులకు అధికారులు సిద్ధమయ్యారు. ఐఎస్ఐ సర్టిఫికేట్ లేకుండా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ సరఫరా చేస్తున్న సంస్థల మీద తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. యజమానుల మీద కేసులు నమోదు చేసి, కోర్టులో జ్యుడీషియల్ ప్రాసిక్యూట్ చేస్తామని జాయింట్ ఫుడ్ సేప్టీ కంట్రోలర్ స్వరూప్ చెప్పారు. ఐఎస్ఐ సర్టిఫికేట్ లేని వాటర్ ప్లాంట్లకు తాము ఫుడ్ లైసెన్స్ ఇవ్వడం లేదని, అవి అనధికారికంగా నడుస్తున్నట్టు అర్థమని ఆయన తెలిపారు.