కూలేందుకు సిద్ధం..పాణ్యం పీహెచ్సీ..
1 min read– వేరే చోటుకు తరలించాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ. రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ డిమాండ్
పల్లెవెలుగు వెబ్, పాణ్యం: నంద్యాల జిల్లా పాణ్యంమండలకేంద్రంలోని వ సబ్ సెంటర్ ఆఫీస్ రెండు కట్టెలు విరిగి కూలేందుకు సిద్ధంగా ఉంది. సబ్ సెంటర్‌పై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో దాదాపు 10 మంది ఆశ వర్కర్స్ 3 సిస్టర్ లు డాక్టర్స్ నిత్యం ప్రజలకు సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లు సిబ్బందికి భద్రత లేక ఎన్నో సార్లు అధికారులకు తెలియచేసిన స్పందించడం లేదని AIFB, RVF ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వనం వెంకటాద్రి రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రతాప్, రియాజ్ లు మాట్లాడుతూ భద్రత కల్పించి నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఈ సబ్ సెంటర్ ను వేరే చోటికి తరలించాలని సిబ్బంది విధులు నిర్వహించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని విధులు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొందని ఆశ వర్కర్లతో విధుల సమయానికంటే ఎక్కవగా పని చేయిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సేవలను ఎల్లవేళలా చూసుకుంటున్నవారికి 18000 శాలరీ లు ఇచ్చి వారికీ గవర్నమెంట్ వారు ఇచ్చే సంక్షేమ పథకాలను వీరికి కూడా వర్తింపజేయాలని ఆశలకు ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే వారికీ రూ.50,00000 ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని వారు డిమాండ్ చేస్తు పాణ్యం తాసిల్దార్ మల్లికార్జున రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు AIFB, RVF ప్రజాసంఘాల పార్టీలు ఈ కార్యక్రమం లో kj శ్రీనివాసరావు రియాజ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.