ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్దం !
1 min readపల్లెవెలుగువెబ్ : అంతర్జాతీయంగా ఎలాంటి ప్రతికూల ఆర్థిక పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అమెరికా కేంద్ర బ్యాంక్ ‘ఫెడ్ రిజర్వ్’ వడ్డీ రేట్లు పెంచడం, రుణ పత్రాల బైబ్యాక్ తగ్గించడం వంటి చర్యలు తీసుకున్నా మన ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ఢోకా ఉండదన్నారు. కేంద్ర బడ్జెట్‌పై ఫిక్కీ నిర్వహించిన సదస్సులో ఆమె ఈ విషయం స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కోలుకుంటున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడులు పెంచాలని కోరారు. ప్రస్తుత వ్యాపార అవకాశాల్ని పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.