జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం !
1 min readపల్లెవెలుగు వెబ్ : ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ప్రజల తరపున పోరాడుతూనే ఉంటామని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. వైకాపా బెదిరింపులకు భయపడమని చెప్పారు. జైలుకు వెళ్లడానికైనా సిద్ధమేనని అన్నారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత చూసి చంద్రబాబు ఇంటి పై దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. ఇష్టానుసారం అప్పులు చేసి ప్రజల పై పన్నుల భారం మోపుతున్నారని అన్నారు. ప్రజల్లో చాలా మార్పు వచ్చిందని, మార్పును చూసి వైకాపా నేతల్లో భయం పట్టుకుందన్నారు.