PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాజీనామాల‌కు రెడీ.. జ‌గ‌న్ కు చంద్రబాబు స‌వాల్

1 min read

పల్లెవెలుగు వెబ్: ప్రత్యేక హోదా పై చంద్రబాబు సీఎం జ‌గ‌న్ కు స‌వాల్ విసిరారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే టీడీపీ ఎంపీలు వెంట‌నే రాజీనామా చేస్తారంటూ టీడీపీ అధినేత స‌వాల్ విసిరారు. వైసీపీ అవకాశవాద రాజకీయాలతో రాష్ట్రం భ్రష్టుపట్టి పోతోందన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్రం మెడలు వంచుతామని నాడు జగన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలు ఇప్పుడు ఎందుకు పోరాడరని చంద్రబాబు ప్రశ్నించారు. ‘‘హోదాపై ఎందుకు పోరాడలేక పోయారు? ప్రత్యేక హోదా కోసం మీ ఎంపీలను రాజీనామా చేయమనండి. మా ముగ్గురు ఎంపీలు రాజీనామాలు చేస్తారు. హోదా కోసం 25 మంది ఎంపీల రాజీనామాల సవాల్‌కు జగన్ సమాధానం చెప్పాలి“ అంటూ ప్రశ్నించారు.

About Author