రాజీనామాకు సిద్దం : టీడీపీ ఎంపీలు
1 min readపల్లెవెలుగు వెబ్ : ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్ వేదికగా గళమెత్తుతామని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ స్పష్టం చేశారు. కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం తర్వాత తెదేపా ఎంపీలు మీడియతో మాట్లాడారు. వైకాపా వైఖరి వల్ల కేంద్రం వద్ద తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాము రాజీనామాకు సిద్ధమని కనకమేడల రవీంద్రకుమార్ ప్రకటించారు. వైకాపా ఎంపీలు కూడ రాజీనామా చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకునేందుకు పోరాటం చేయాలని డిమాండ్ చేశారు.