కేసీఆర్ తో కలిసి నడిచేందుకు సిద్ధం
1 min readపల్లెవెలుగువెబ్ : సీఎం కేసీఆర్తో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి భేటీ ముగిసింది. ఇరువురు జాతీయ రాజకీయాలపై చర్చించారు. ఎన్డీఏ, యూపీఏ తరహా పీపుల్ ఫ్రంట్ అవశ్యకతపై.. కేసీఆర్ అభిప్రాయం వెల్లడించారు. తమతో కలిసి రావాలని కుమారస్వామిని కేసీఆర్ కోరారు. జాతీయ రాజకీయాల్లో కలిసి పనిచేసేందుకు.. కుమారస్వామి సుముఖత వ్యక్తం చేశారు. కొత్త జాతీయ పార్టీని ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. అతి త్వరలోనే జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు అధికార పార్టీ పత్రిక, చానల్ ద్వారా స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన కేసీఆర్.. పార్టీ జిల్లా అధ్యక్షులందరితో తెలంగాణ భవన్లో ఇటీవల మీడియా సమావేశం పెట్టించి మరీ చెప్పించారు. నిజానికి, జాతీయ పార్టీ పెడతానని కొంతకాలంగా కేసీఆర్ చెబుతున్న విషయం తెలిసిందే.