నిజమైన ప్రజాసేవకులు జర్నలిస్టు లే
1 min read– ఎ.వి.వి.శ్రీనివాస్ ,జర్నలిస్ట్ మిత్రుల సంక్షేమ సంఘం అధ్యక్షులు
పల్లెవెలుగు వెబ్ విజయవాడ: ఫిబ్రవరి కదిరి లో రెండు వర్గాల మధ్య జరుగుతున్న గోడవలను కవర్ చేయడానికి వెళ్ళిన జర్నలిస్టులపై సిఐ అక్రమ కేసులను బనాయించడం,సిఐ వైసిపి భుజాలపై ఎక్కి మీసం మెలేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చా అని జర్నలిస్ట్ మిత్రుల సంక్షేమ సంఘం అధ్యక్షులు డిమాండ్ చేస్తు ఓక ప్రకటన చేశారు. జర్నలిస్టులంటే ప్రజలకు ప్రభుత్వాలకు వారధి లాగ పని చేస్తారు .జీతాలు ఉన్న లేకున్నా ప్రజా ప్రయేజనాలకు భంగం కలిగినప్పుడు వారు చేసే సేవా వెలకట్టలేనిది.నీవలన మాకు మేలు జరిగింది అని ఏవరైన ప్రశంసిస్తే ఆప్రసంశలే జీతాలుగా ,రివార్డులగా అనుకునే బతుకు జీవనం సాగించే అల్ప సంతోషులం అటువంటి జర్నలిస్ట్ లపై దాడులు చేయడం ప్రజాస్వామ్యంపై దాడిగా పరిగణించాలి.సిఐ వైసిపి వారి బుజాలపై ఎక్కి మీసం మెలేసి తోడగోట్టటం వంటి చర్యలు ఓక భాధ్యతలేని అధికారిగా భావించ వచ్చు పైగ ప్రభుత్వ జీపుపై కి ఎక్కి మీసాలు మెలేసి మహిళలని చూడకుండా బుతులు తిట్టడం నాస్థాయి మీది కాదు అనటం వంటి చేష్టలు సమర్థనీయం కాదు .త్వరలోనే కదిరి సంఘటనపై నిజనిర్ధారణ కమిటితో విచారణ జరుపుతామన్నారు. డిజిపి తక్షణమే స్పందించి సిఐని సస్పెండ్ చేసి జర్నలిస్టుల పై పెట్టిన కేసులు ఏత్తి వేయాలని డిమాండ్ చేశారు.