PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వార్డు సభ్యుల ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ

1 min read

– ఎంపీడీవో గంగనపల్లి సురేష్ బాబు

పల్లెవెలుగు  వెబ్ చెన్నూరు: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మండలంలోని బయనపల్లి గ్రామంలో ఖాళీగా ఉన్న 9వ వార్డు సభ్యుడు ఎన్నిక కు ఈనెల 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు వార్డు సభ్యుడు ఎన్నికకు నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు ఎంపీడీవో గంగన్నపల్లి సురేష్ బాబు తెలిపారు, ఈ సందర్భంగా ఆయన మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని బయనపల్లి గ్రామ పంచాయతీలోని 9వ వార్డుకు సంబంధించి వార్డు సభ్యుల భర్తీ ఖాళీగా ఉన్నధని ఆయన తెలిపారు, ఖాళీగా ఉన్నటువంటి ఈ వార్డు స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం ఈనెల  8వ తేదీ నుండి, పదవ తేదీ వరకు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.

About Author