‘ప్రతిభ’కు.. గుర్తింపు..
1 min read336 మంది విద్యార్థినులకు ‘మలబార్’ స్కాలర్షిప్
అభినందించిన ఏపీ ఉమెన్ కమిషన్ రాయలసీమ ఇన్చార్జ్ రుఖియాబీ
పల్లెవెలుగు, కర్నూలు: జిల్లాలో ప్రతిభ గల విద్యార్థినులను గుర్తించి… వారిని ప్రోత్సహించడంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం ముందుందని అభిప్రాయపడ్డారు ఏపీ ఉమెన్ కమిషన్ రాయలసీమ ఇన్చార్జ్ రుఖియాబీ. మంగళవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో.. ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను గుర్తించి… వారికి స్కాలర్షిప్లు అందజేశారు. ఈ సందర్భంగా రుఖియా బీ మాట్లాడుతూ బాలికల చదువును ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో మలబార్ గోల్డ్ సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రశంసనీయమన్నారు. జిల్లాలోని వివిధ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న 336 మంది విద్యార్థినులకు రూ.8వేల నుంచి 10వేలు చొప్పున మొత్తం 29.6 లక్షలు స్కాలర్ షిప్ ఇచ్చారు. మున్ముందు రాష్ట్ర వ్యాప్తంగా 5500 మంది విద్యార్థినులకు స్కాలర్షిప్లు ఇస్తామని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. బాలికల చదువు.. దేశానికి వెలుగు లాంటిదని, ప్రతిఒక్కరూ బాలికల చదువును ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ఏపీ ఉమెన్ కమిషన్ రాయలసీమ ఇన్చార్జ్ రుఖియాబీ కోరారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ కేఎల్ఆర్కె కుమారి, కలెక్టర్ కోటేశ్వరరావు సతీమణి స్వర్ణలత, మలబార్ షోరూం స్టోర్ హెడ్ ఫయాజ్, అసిస్టెంట్ హెడ్ సమీర్, మార్కెటింగ్ మేనేజర్ నూర్వుల్లా, సుధాకర్, మన్సూర్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.