కష్టపడితే పార్టీలో గుర్తింపు : బి.వై. రామయ్య
1 min readపల్లెవెలుగు వెబ్ కల్లూరు: అంకితభావంతో కష్టపడి పనిచేసే వారికి వైయస్ఆర్ సిపిలోనే గుర్తింపు లభిస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగర మేయర్ బి.వై. రామయ్య అన్నారు. వైయస్ఆర్ సిపి మహిళా విభాగం కర్నూలు నంద్యాల జిల్లాల జోనల్ ఇంచార్జ్ గా నియమితులైన గాజుల శ్వేత రెడ్డి, భర్త కవినాథ్ లు గురువారం బి.వై. రామయ్యను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్వేత రెడ్డిను బి.వై. రామయ్య శుభాకాంక్షలు తెలిపారు. తన ఎంపికకు సహకరించినందుకు బి.వై. రామయ్యకు శ్వేత రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.