PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెయిడ్ న్యూస్ గుర్తింపు లో ఎంసిఎంసి పాత్ర కీలకం

1 min read

జిల్లా రెవెన్యూ అధికారి కె మధుసూదన్ రావు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  పెయిడ్ న్యూస్ గుర్తింపు లో ఎంసిఎంసి (మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ) పాత్ర కీలకం అని జిల్లా రెవెన్యూ అధికారి కె మధుసూదన్ రావు పేర్కొన్నారు.మంగళవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో  రానున్న సాధారణ ఎన్నికలు 2024 కు సంబంధించిన ఎంసి ఎంసి సభ్యులకు  శిక్షణ ను జిల్లా రెవెన్యూ అధికారి కె మధుసూదన్ రావు నిర్వహించారు.ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ రానున్న సాధారణ ఎన్నికలలో పోటీ చేసే  అభ్యర్థులు  ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా లో ప్రకటనల జారీ కి MCMC నుంచి తప్పనిసరిగా  అనుమతి తీసుకోవాలన్నారు. బల్క్ sms , voice message లకు కూడా అనుమతి తీసుకోవాలన్నారు.. ప్రింట్ మీడియాలో  ప్రకటనల జారీకి  పోలింగ్ రోజున మరియు పోలింగ్ రోజుకు ముందు మాత్రమే ఎంసీఎంసీ కమిటీ అనుమతి తప్పనిసరి అని డిఆర్ఓ తెలిపారు. ఒక అభ్యర్థి కి అనుకూలంగా, ఓటర్లను ప్రభావితం చేసే   పెయిడ్ న్యూస్ పైన MCMC ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.. అలాగే  ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ట్విట్టర్, యూట్యూబ్, వెబ్ పేపర్స్ వంటి వాటిని కూడా పరిశీలించాలని తెలిపారు.APIIC…ZM సోమశేఖర్ రెడ్డి, DCO రామాంజనేయులు ఎంసిఎంసి సభ్యులకు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎంసిఎంసి నిర్వహించవలసిన విధుల గురించి  శిక్షణ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంసి ఎంసి మెంబర్ సెక్రెటరీ, సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె.జయమ్మ, సభ్యులు సిపిఓ హిమ ప్రభాకర్ రాజ్, nic DIO ప్రవీణ్ కుమార్ రెడ్డి,AIR ప్రోగ్రాం ఆఫీసర్ మురళి, హన్స్ ఇండియా స్టాఫ్ రిపోర్టర్ వి నరేంద్ర కుమార్, ఇండస్ట్రీస్ GM మారుతి ప్రసాద్, ఎలక్షన్ విభాగం సూపరిండెంట్ మురళి తదితరులు పాల్గొన్నారు.

About Author