రికార్డు స్థాయిలో ఆదాయం…
1 min read
పోటాపోటీగా పంచాయతీ వేలాలు
వేలం నిర్వహిస్తున్న అధికారులు
కౌతాళం , న్యూస్ నేడు: కౌతాళం మేజర్ పంచాయతీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. వేలాల్లో గత ఏడాది పంచాయతీకి రూ.3,31,750లక్షలు ఆదాయం రాగా, ఈ ఏడాది రూ.11,70,000లక్షలు ఆదాయం ఎక్కువగా వచ్చినట్లు గ్రామ సర్పంచ్ పాల్ దినకర్,డీఎల్పీవో నూర్జహాన్, ఈఆర్డి యోగేశ్వర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ప్రకాశం,శివప్ప తెలిపారు.గురువారం మేజర్ పంచాయతీ కార్యాలయంలో వేలాలు నిర్వహించారు. బండి మెట్టను సంకబేరి రాజు రూ.11,70,000లక్షలకు,కబేళాను ఏరిగేరి నబిమ్మ రూ.10,5000, దినసరి మార్కెట్ ఏరిగేరి నబిమ్మ 15,000దక్కించుకున్నట్లు డీఎల్పీవో నూర్జహాన్ తెలిపారు.ఈ ఏడాది కౌతాళం మేజర్ పంచాయతీకి రికార్డు స్థాయిలో రూ.11,70,000లక్షలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. పంచాయతీ వేలాల్లో టీడీపీ, వైసీపీ, ఇతరు నాయకులు పోటీగా పాల్గొన్నారు.ఎలాంటి అవాం ఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ అశోక్ కుమార్,గట్టిబందోబస్తు నిర్వహించారు.