PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మొబైల్ ఫోన్లు రికవరీ..బాధితులకు అందజేత

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రెండవ విడతలో రికవరీ చేసిన 630  ( రూ.1 కోటి 26 లక్షల విలువ)  మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన …  జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్  ఐపియస్సెల్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగం అయ్యిందని బయటకు వెళ్లినప్పుడు మొబైల్ ఫోన్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి… జిల్లా ఎస్పీ.మొదటి విడతలో  652 మొబైల్స్ ( విలువ రూ.1 కోటి 30 లక్షలు )  రెండవ విడతలో 630 మొబైల్స్ ( విలువ రూ.1 కోటి 26 లక్షలు)ఇప్పటి వరకు మొత్తం … 1,282 మొబైల్స్ రికవరీ చేశాం.( వాటి విలువ 2 కోట్ల 56 లక్షలు) ల్లా పోలీసు కార్యాలయంలో “ మొబైల్ రికవరీ  మేళా ” కార్యక్రమం.పొగోట్టుకున్న మొబైల్ ఫోన్లను ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి  రికవరి చేసి భాధితులకు అందజేశాం.మొబైల్ ఫోన్ పోతే … http://Kurnoolpolice.in/mobiletheft లింకు ను క్లిక్ చేసి మొబైల్ వివరాలను తెలియజేస్తే బాధితులకు త్వరితగతిన అందజేసేందుకు కృషి చేస్తాం. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని  పేరడ్ మైదానంలో ఏర్పాటు చేసిన  “మొబైల్ రికవరీ  మేళా” లో  జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ ఐపియస్ 1 కోటి 26 లక్షల విలువ గల 630 మొబైల్ ఫోన్ లను బాధితులకు  అందజేశారు.ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ మాట్లాడుతూ…. ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్ అనేది మన జీవితంలో ఒక భాగంగా ఉంది. మొబైల్ కోనుగోలు చేసినప్పటి నుండి ప్రతి ఒక్కటి మొబైల్  నిక్షిప్తమై ఉంటుంది. కష్టపడి కోనుగోలు చేసిన తర్వాత మొబైల్  పోగోట్టుకుంటే కలిగే భాధ, ఆవేదన మనందరికి తెలుసన్నారు.పర్సనల్ వివరాలు, ఫోటోలు, ఫోన్ నెంబర్లు, వ్యాపార లావా దేవిలు, అటాచ్ మెంట్స్, సెంటిమెంట్స్, ఆన్ లైన్ బ్యాంకు ఖాతా వ్యవహరాలు,  ఇలా చాలా మిస్ అవుతారన్నారు.  ఫోన్ పొగోట్టుకున్న వ్యక్తి కి ఫోన్ దొరకదని అనుకున్నప్పుడు మానసిక వేదనను వివరించడం చాలా కష్టం,  ఈ ఆవేదనను దృష్టిలో ఉంచుకుని మొబైల్ ఫోన్లను కర్నూలు పోలీసులు కష్టపడి రికవరీ చేసి బాధితులకు అందజేయడం  జరుగుచున్నది. ఇది చాలా సంతోషకరమైన విషయం.  క్షేత్రస్ధాయి నుండి క్రింది స్ధాయి సిబ్బంది వరకు ఫీల్డ్ లో ఉండి ఎంతో కష్టపడి పని చేస్తనే ఈ ఫలితం వస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు , కర్నాటక  రాష్ట్రాలను నుండి మొబైల్స్ ను రికవరీ చేయడం జరిగింది.వృద్దాప్యంలో ఉన్న వారు వాళ్ళ కష్టార్జితాన్ని , రిటైర్ మెంట్ బెనిఫిట్స్ ను పెద్ద మొత్తంలో 30 లక్షలు, 40 లక్షల నగదును బ్యాంకులలో   దాచుకొని ఉంచుకున్నప్పుడు మొబైల్ ఫోన్ పోయినప్పుడు , పాస్ వర్డ్స్ సేవ్ చేసుకుని ఉన్నప్పుడు  సైబర్ క్రైమ్  జరిగే అవకాశం ఉంది. సెల్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగం అయ్యిందని బయటకు వెళ్లినప్పుడు మొబైల్ ఫోన్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు. రెండవ విడతలో 630 ( విలువ రూ.1 కోటి 26 లక్షలు)మొబైల్ ఫోన్లను రికవరీ చేసేందుకు కృషి చేసిన  ప్రతి ఒక్క పోలీసును  మరియు ప్రత్యేకంగా సైబర్ ల్యాబ్ పోలీసులను  అభినందిస్తున్నాం.మొదటి విడతలో  652 మొబైల్స్ ( విలువ రూ.1 కోటి 30 లక్షలు ) ఇప్పటి వరకు మొత్తం … 1,282 మొబైల్స్ రికవరీ చేశాం.(వాటి విలువ 2 కోట్ల 56 లక్షలు) మొబైల్ పోయిన తర్వాత బాధపడడం కంటే ఆ మొబైల్ ఫోన్ పోగోట్టుకోకుండా జాగ్రత్తలు పాటించడం మంచిదని జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.పోగోట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేసి ఇవ్వడం ఆనందంగా ఉందని,  జిల్లా ఎస్పీ కి, కర్నూలు పోలీసులకు   బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇందులో…1)    పెద్దెటి సాగర్   –  గుంటూరు జిల్లా

మాది గుంటూరు జిల్లా , నల్లపాడు. కారు డ్రైవర్ గా  పని చేస్తున్నాను.  మా అమ్మ కు  శస్త్ర చికిత్స నిమిత్తం గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్ళాము. మొబైల్ చార్జింగ్ పెట్టి ఆపరేషన్ థియేటర్ కు వెళ్ళినప్పుడు మొబైల్ దొంగలించారు.  కర్నూలు పోలీసు ఫేస్ బుక్ చూసి ఆన్ లైన్ లో అప్లై చేయడం జరిగింది. నా మొబైల్ ను బెంగుళూరు నుండి రికవరీ చేయడం జరిగిందని, నా మొబైల్ పోయినప్పుడు ఎంత బాధ పడ్డానో దొరికిందని తెలియగానే చాలా ఆనందంగా ఉంది అని పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

2)      ఓబుల పతి – నందికొట్కూరు .

కంట్రాక్టు లెక్చరర్ గా పని చేస్తున్నాను. గుత్తి పెట్రోల్ బంక్ – కర్నూలు నుండి అనంతపురం వెళ్ళే టప్పుడు  మొబైల్ పోయింది. కర్నూలు ఒకటవ పట్టణ పోలీసుల సహాయంతో కర్నూలు పోలీసు వెబ్ సైట్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.   నా మొబైల్ ను మహబూబ్ నగర్ జిల్లా నుండి రికవరీ చేయడం ఆనందంగా ఉంది.

3)  నవీన్ కుమార్ – ఎమ్మిగనూరు.

గత సంవత్సరం డిసెంబర్ నెలలో మంత్రాలయం టెంపుల్ లో నా మొబైల్ పోయింది. కర్నూలు పోలీసు ఫేస్ బుక్ చూసి  పోలీసుల సహాయంతో కర్నూలు పోలీసు వెబ్ సైట్  మరియు మీ సేవాలో  ఫిర్యాదు చేయడం జరిగింది. కర్ణాటక లో నా మొబైల్  ను  రికవరీ చేసి ఇవ్వడం ఆనందంగా ఉంది.

4) రఫీ  –  నంద్యాల జిల్లా.

నంద్యాల జిల్లా , గోస్పాడు . కర్నూలు బిర్లాగేట్ లో ఆర్ ఆర్ బి కోచింగ్ తీసుకునే సమయంలో  నా మొబైల్ ఫోన్ పోయింది.  తెలిసిన వారి ద్వారా  కర్నూలు పోలీసు వెబ్ సైట్ కు పిర్యాదు చేయడం జరిగింది.  నా ఫోన్ ను రికవరీ చేసి ఇవ్వడం ఆనందంగా ఉంది.

5)  జాకీర్ ఉస్సేన్  –  నంద్యాల జిల్లా.నేను లారీ ట్రాన్సపోర్టులో పని చేస్తున్నాను.  నంద్యాల ఉదానంద హాస్పిటల్ లో నా మొబైల్ పోయింది. నా మొబైల్ దొరకదని అనుకున్నాను. మొబైల్ దొరకడం చాలా హ్యాపీగా ఉంది. తమిళనాడు రాష్ట్రం నుండి నా మొబైల్ రికవరీ చేయడం ఆనందంగా ఉంది

6) జి. చేతన – కర్నూలు .కర్నూలు – రైతు సాదికారత లో సినీయర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాను. నంద్యాల చెక్ పోస్టు నుండి కర్నూలు  బి. తాండ్రపాడులోని మా ఇంటికి వెళ్ళడానికి ఆటో ఎక్కి వెళ్ళేటప్పుడు మొబైల్  పోయింది. మార్చి నెలలో రూ. 40 వేలు పెట్టి EMI లో మొబైల్ తీసుకున్నాను. 2 నెలలు మాత్రమే అయింది.  మొబైల్ పోయిందని ఆఫీస్ ఫైల్స్, పర్సనల్ ఫైల్స్, మెయిల్స్,  ప్రతి వర్క్ ను మొబైల్ లో సేవ్ చేసుకునే నా మొబైల్పోయిందని చాలా ఇబ్బంది పడ్డాను.   కర్నూలు పోలీసులు కష్టపడి నా మొబైల్ ను వెతికి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది.  ఈ కార్యక్రమంలో కర్నూలు పట్టణ డిఎస్పీ శ్రీ విజయ శేఖర్, ట్రైనీ డిఎస్పీ భావన, సిఐలు …శ్రీనివాస రెడ్డి,  అబ్దుల్ గౌస్, శ్రీరామ్, పవన్ కుమార్ ,  సైబర్ ల్యాబ్ టెక్నికల్ టీం ఎస్సై వేణుగోపాల్, ఎస్సైలు .. మోహన్ కిశోర్, ఖాజవలి , సైబర్ ల్యాబ్ టెక్నికల్ పోలీసులు ఉన్నారు.

About Author