NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

90 రోజుల్లో రిక్రూట్ మెంట్ పూర్తీ చేయాలి : సీఎం జ‌గ‌న్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప్రభుత్వాస్పత్రుల్లో 90 రోజుల్లోగా నియామ‌కాల భ‌ర్తీ పూర్తీ చేయాల‌ని సీఎం జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. ప్రజ‌ల‌కు వైద్య సేవ‌లు అందించ‌డంలో ఇబ్బందులు రాకూడ‌ద‌ని స్పష్టం చేశారు. స్కూళ్లలో కోవిడ్ క‌ట్టడి చ‌ర్యలు తీసుకోవాల‌ని పిలుపునిచ్చారు. ఎవ‌రికైన క‌రోన ల‌క్షణాలు క‌నిపిస్తే వెంట‌నే ప‌రీక్షలు చేయించాల‌ని ఆదేశించారు. వ్యాక్సినేష‌న్ లో గ్రామ‌, వార్డుల‌ను యూనిట్ గా తీసుకోవాల‌ని, ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సిన్ వేయాల‌ని సూచించారు. ఉద‌యం 6 నుంచి రాత్రి 11 వ‌ర‌కు లాక్ డౌన్ స‌డ‌లింపులు ఉంటాయ‌ని తెలిపారు. ప‌లు అంశాల‌పై సీఎం జ‌గ‌న్ అధికారుల‌తో స‌మీక్ష నిర్వహించారు. కోవిడ్ నిబంధ‌న‌లు పాటించేలా అధికారులు చ‌ర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు.

About Author