రెడ్ అలర్ట్ .. 2015 తర్వాత ఇదే భారీ వర్షం !
1 min read
పల్లెవెలుగు వెబ్: తమిళనాడులో భారీ వర్షాలు కరుస్తున్నాయి. వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. చెన్నై నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. టీ. నగర్, గిండీ, సైదాపేట, వేలచ్చేరి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కన్యాకుమారి, కాంచీపురం, మధురైలో జోరువాన కురుస్తోంది. చెన్నైలోని పలు ప్రాంతాల్లో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. 2015 తర్వాత తొలిసారి ఆ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న 48 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. వరదలపై ముఖ్యమంత్రి స్టాలిన్ సమీక్ష చేపట్టారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎం స్టాలిన్ అధికారులను ఆదేశించారు.