రెడ్ క్రాస్ సేవలు విస్తరింపచేసి, రెడ్ క్రాస్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలి
1 min read
జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా
కర్నూలు , న్యూస్ నేడు : రెడ్ క్రాస్ సేవలను ఇంకా విస్తరింపచేసి, రెడ్ క్రాస్ బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా సభ్యులకు సూచించారు..బుధవారం తన క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ సొసైటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… రెడ్ క్రాస్ సొసైటీ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే చర్యలు తీసుకోవాలని, అందుకు తగ్గట్లు సేవలను విస్తరించాలని సభ్యులకు సూచించారు.పాఠశాలల్లో పిల్లల కు ఫస్ట్ ఎయిడ్ , సి పి ఆర్ నేర్పించే చర్యలు తీసుకోవాలని, మెడికల్ క్యాంప్ లు నిర్వహించాలని సూచించారు..రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, పిడుగులు పడినపుడు బాధితులను ఆదుకునే చర్యలు చేపట్టాలన్నారు..అలాగే స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాలు చేపట్టాలని, అనాధ పిల్లలను ఆదుకునే చర్యలు, వారిని చదివించే ఏర్పాట్లు చేయాలని, పేద పిల్లలకి అవసరమైన స్కూల్ యూనిఫారంలు, షూస్, నోట్ పుస్తకాలు అందచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సభ్యులకు సూచించారు.రాష్ట్రంలోనే మొట్టమొదటి స్కిన్ బ్యాంకు పూర్తి స్థాయిలో ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సభ్యులను ఆదేశించారు..తల సేమియా రోగులకు రక్తం, మందుల సరఫరా , బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ కు అవసరమైన చర్యలు , జన ఔషధీ దుకాణం ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని సభ్యులకు సూచించారు. ఈ అంశాలపై కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్ సూచించారు.నంద్యాల జిల్లా ఏర్పాటు వలన కర్నూలు జిల్లా రెడ్ క్రాస్ సభ్యుల సంఖ్య తగ్గిపోయినందున కర్నూలు కలెక్టరేట్, మూడు రెవెన్యూ డివిజన్ లలో సభ్యుల సంఖ్య ను పెంచుకునే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కే జీ గోవిందరెడ్డి, వెంకటకృష్ణ సెక్రటరీ లు రెడ్ క్రాస్ సంస్థ తరఫున బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించి అవసరార్థులకు అందించే అందించే చర్యలు, కంటి శుక్లాలు , ఆర్గాన్ డొనేషన్లు చేసే చర్యలు తీసుకుంటున్నామని, వారి పిల్లలకు చదువు విషయంలో అండగా ఉంటున్నామని, శబరిమల అయ్యప్ప భక్తులకు మరియు శ్రీశైలం నడకదారి లో వెళ్లే భక్తులకు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, డిఎం అండ్ హెచ్ ఓ ఆధ్వర్యంలో పల్స్ పోలియో, లెప్రసీ, ఎయిడ్స్ అవేర్నెస్ ర్యాలీలు నిర్వహించి ప్రజలను చైతన్య పరుస్తున్నామని, స్కూల్ పిల్లలకు ఆరోగ్య విషయాలపై పోటీ పరీక్షలు నిర్వహించి వారిని అభినందించే చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కు వివరించారు.సమావేశం లో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కేజీ గోవిందరెడ్డి, సెక్రటరీ వెంకటకృష్ణ (రిటైర్డ్ రెవెన్యూ డివిజనల్ అధికారి) మెడికల్ ఆఫీసర్ రామచంద్ర రావు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రమేష్ బాబు పాల్గొన్నారు.
కలెక్టర్, స్కిన్ బ్యాంకు, సొసైటీ చైర్మన్,