PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేద ప్రజలకు అండ ఎర్రజెండా….

1 min read

సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పి.రామచంద్రయ్య

సిపిఐ పతాకాన్ని ఆవిష్కరించిన పి. రామచంద్రయ్య.

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పేద ప్రజలకు అండ ఎర్రజెండా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి. రామచంద్రయ్య అన్నారు. మంగళవారం పత్తికొండలో భారత కమ్యూనిస్టు పార్టీ( సిపిఐ) 99వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి. రామచంద్రయ్య, వీకే ఆదినారాయణ రెడ్డి కాలనీ లో, సిపిఐ కార్యాలయం ఎదుట పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. మండలంలోని పందికోన, కొత్తపల్లి గ్రామాలలో సిపిఐ మండల కార్యదర్శి డి. రాజా సాహెబ్, దిద్దు చేను కొట్టాల కాలనీలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కారుమంచి,నలకదొడ్డిలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మయ్య, దూదేకొండలో హమాలి అంజనేయ, పెద్దహుల్తిలో హుల్తన్న లు పార్టీ పతాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పి.రామచంద్రయ్య మాట్లాడుతూ, సిపిఐ ఆవిర్భావం నుండి పేద ప్రజలు, కార్మిక, కర్షక, శ్రామిక వర్గాల పక్షాన అనేక ఉద్యమాలను చేపట్టడం జరిగిందన్నారు. భారతదేశ స్వాతంత్రోద్యమ పోరాటంలో పాల్గొన్న పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అని,దున్నేవాడికే భూమి అనే  నినాదంతో భూమిలేని నిరుపేదలకు భారత కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో లక్షలాది ఎకరాలు భూములుపంచడం జరిగిందన్నారు. దోపిడీ లేని సమ సమాజ స్థాపన కోసం పార్టీ శ్రేణులు ఉద్యమించాలన్నారు. దేశ సంపద కొంతమంది స్వార్థపరుల చేతుల్లో కాకుండా ప్రజలందరికీ సమానంగా అందాలన్నారు. కేంద్రంలో మోడీ , రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలు ప్రమాదకరంగా ఉన్నాయని 2024 ఎన్నికల్లో మోడీ, జగన్ లను ఇంటికి సాగనంపుదాం అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు పి. భీమ లింగప్ప, పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, జిల్లా సమితి సభ్యులు సురేంద్ర కుమార్, కృష్ణయ్య, పెద్ద ఈరన్న, శాఖ కార్యదర్శులు గిడ్డయ్య గౌడ్, జొహరాపురం కాశి, రాజప్ప, నాగేంద్ర, ప్రజా సంఘాల నాయకులు నెట్టికంటయ్య, రంగన్న, గుండు భాష, ఎంకే సుంకన్న, మాదన్న, నజీర్ తదితరులు పాల్గొన్నారు.

About Author