NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎరుపెక్కిన మార్కెట్.. యుద్ధ వాతావర‌ణంతో భీతిల్లిన ఇన్వెస్ట‌ర్లు !

1 min read

పల్లెవెలుగువెబ్ : స్టాక్ మార్కెట్ సూచీలు ఎరుపెక్కాయి. ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య నెల‌కొన్న య‌ద్ధ వాతావ‌ర‌ణంతో ఇన్వెస్ట‌ర్లు అమ్మ‌కాల‌కు దిగారు. దీంతో పెద్ద ఎత్త‌న సూచీలు న‌ష్ట‌పోయాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అన్ని స్టాక్ మార్కెట్లు న‌ష్టాల‌తో ట్రేడ్ అవుతున్నాయి. ఇరుదేశాల మ‌ధ్య నెల‌కొన్న అనిశ్చిత వాతావర‌ణంతో ఇన్వెస్ట‌ర్లు భీతిల్లిపోయారు. ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య నెల‌కొన్న వివాదంతో ఫిబ్ర‌వ‌రి 16 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఇన్వెస్ట‌ర్లు 9 ల‌క్ష‌ల కోట్ల సంప‌ద కోల్పోయారు. యూర‌ప్ తో వ్యాపార సంబంధాలు ఉన్న కంపెనీల స్టాక్ ప్రైస్ భారీగా ప‌డింది. 2 :30 నిమిషాల స‌మ‌యంలో సెన్సెక్స్ 440 పాయింట్ల న‌ష్టంతో 57243 వ‌ద్ద‌, నిప్టీ 144 పాయింట్ల న‌ష్టంతో 1706 వ‌ద్ద ట్రేడింగ్ అవుతున్నాయి.

                                      

About Author