కడప: కూలీలు, పోలీసుల మధ్య భారీ చేజింగ్
1 min read
పల్లెవెలుగు వెబ్: పొట్టకూటికి వచ్చిన కూలీలు, పోలీసుల మధ్య సినిమా లెవెల్లో చేజింగ్ నడిచింది. కూలీలు, పోలీసుల మధ్య చేజింగ్ ఏంటని ఆశ్చర్యం పోతున్నారా.. అవునండి ఇది నిజం. అయితే ఆ కూలీలు సాధారణ పొలంలో పని చేసేవారు కాదు. ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేసే వారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళనాడుకు చెందన ఎర్రచందనం కూలీలు కడప జిల్లాలోని నల్లమల్ల కొండల్లో ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తున్నారు. ఖాజీపేట మండలం నాగసాయిపల్లె చెక్ పోస్టు నుంచి ఐచర్ వాహనంలో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారని ప్రొద్దుటూరు పారెస్ట్ అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో వారు ఎర్రచందనం కూలీలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. దాదాపు గంట పాటు కూలీలు, పోలీసుల మధ్య భారీ చేజింగ్ సాగింది. ఐచర్ వాహనం నుంచి దూకి 40 మంది కూలీలు పారిపోయారు. వీరిలో ఒకరు వాహనం నుంచి దూకడంతో అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం వీరు కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల అదుపులో మరో నలుగురు ఉన్నారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.