PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎరుపెక్కిన స్టాక్ మార్కెట్.. 12 నెలల్లో ఇదే భారీ న‌ష్టం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భార‌త స్టాక్ మార్కెట్ సూచీలు న‌ష్టాల్లో కొనసాగుతున్నాయి. జ‌న‌వ‌రి 2020 త‌ర్వాత ఇంత భారీ స్థాయిలో స్టాక్ మార్కెట్ న‌ష్ట‌పోవ‌డం ఇదే మొదటిసారి. అమెరిక‌న్ ఫెడ్ స‌మావేశం, ర‌ష్యా , ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధ‌వాతావ‌ర‌ణ నెల‌కొన‌డం, ఫారిన్ ఫోర్ట్ ఫోలియో ఇన్వెస్ట‌ర్లు వ‌రుస‌గా అమ్మ‌కాల‌కు దిగ‌డం, క‌రోన వైర‌స్ భ‌యాలు సూచీల్లో భారీ అమ్మ‌కాలకు కార‌ణ‌మ‌య్యాయి. ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధ‌వాతావ‌ర‌ణం కార‌ణంగా క్రూడ్ ఆయిల్ ధ‌ర‌ల్లో భారీ మార్పులు వ‌చ్చాయి. ఇదే ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే.. క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు పెరుగుతాయి. ఈ కార‌ణంగా కంపెనీల ఆదాయాల్లో త‌గ్గుద‌ల క‌నిపిస్తుంది. ఇది ముందే గ్ర‌హించిన ఇన్వెస్ట‌ర్లు అమ్మ‌కాల‌కు దిగారు. మంగ‌ళ‌వారం 12:20 నిమిషాల స‌మ‌యంలో సెన్సెక్స్ 279 పాయింట్ల న‌ష్టంతో 57212 వ‌ద్ద‌, నిప్టీ 52 పాయింట్ల న‌ష్టంతో 17061 పాయింట్ల వ‌ద్ద కొన‌సాగుతోంది.

                                      

About Author