PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వంట గ్యాస్​ ధర తగ్గించాలి: SUCI(C)

1 min read

పల్లెవెలుగు వెబ్​: కర్నూలు నగరం కొత్త పేట ఏరియా నందు SUCI(C) సోషలిస్టు యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్టు) పార్టీ ఆధ్వర్యంలో పెంచిన వంట గ్యాస్ ధరను తగ్గించాలి డిమాండ్ చేస్తూ  ఆదివారం నిరసన తెలిపారు.  ఈ సందర్భంగా SUCI(C) పార్టీ నాయకులు నాగన్న మాట్లాడుతూ.. నిత్యావసర ధరలు పెంచుతూ.. ప్రజలపై భారం మోపడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి..వెంటనే వంట గ్యాస్​ ధర తగ్గించాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో విశ్వనాథ్, బాబు, మల్లేష్, శ్రీమాన్, రేణుక తదితరులు పాల్గొన్నారు.

About Author