NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆస్తి, నీటి పన్ను తగ్గించండి

1 min read

–పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆస్తి, నీరు, చెత్త పన్నులు తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కర్నూలు నగర మేయర్​ బీవై రామయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాకే శైలజానాథ్​ మాట్లాడుతూ దేశం, రాష్ట్రంలోనూ కరోణ మహమ్మారి విజృంభణ, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల, నిత్యావసర ధరల పెరుగుదల పనులు లేక సామాన్య ప్రజలు విలపిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 196, 197, 198 జీవోల ద్వారా పన్నులు పెంచడం దారుణమన్నారు. చివరకు చెత్తపై పన్ను వేయడం ఏమిటని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు అహమ్మద్​ ఆలీ ఖాన్​, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులు పాణ్యం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి నాగమధు యాదవ్, కర్నూలు నగర కాంగ్రెస్ అధ్యక్షులు జాన్ విల్సన్, నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జులు దామోదర్ రాధాకృష్ణ బాబూరావు , క్రాంతి నాయుడు , కర్నూలు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పాలం సుజాత తదితరులు పాల్గొన్నారు.

About Author