NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

త‌గ్గిన చికెన్ ధ‌ర‌.. నాన్ వెజ్ ప్రియుల‌కు పండ‌గ‌..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: చికెన్ ప్రియుల‌కు పండ‌గే పండుగ‌. చికెన్ ధ‌ర‌లు కేజీకి 100 రూపాయాలు త‌గ్గింది. 270 ఉన్న కేజీ చికెన్ ధ‌ర ప్రస్తుతం 170గా ఉంది. రాష్ట్రంలో డిమాండ్ త‌గ్గడం… ఇత‌ర రాష్ట్రాల‌కు స‌ర‌ఫ‌రా నిలిచిపోవ‌డంతో చికెన్ ధ‌ర‌లు అమాంతం త‌గ్గాయి. దీంతో చికెన్ ప్రియులు పండ‌గ చేసుకుంటున్నారు. క‌రోన కార‌ణంగా బ‌హిరంగ స‌మావేశాలు నిషేధించారు. ఇవి ఉంటేనే చికెన్ కు మంచి డిమాండ్ ఉంటుంది. ఏ స‌మావేశంలో అయినా.. నాన్ వెజ్ అంటే చికెన్ కే ఎక్కువ మంది మొగ్గుచూపుతారు. పెద్ద పెద్ద స‌మావేశాల్లో మట‌న్ పెట్టలేరు. కాబ‌ట్టి చికెన్ కే ఎక్కువ మంది మొగ్గుచూపుతారు. దీంతో చికెన్ అమ్మాకాలు కూడ బాగుంటాయి. క‌రోన త‌ర్వాత డిమాండ్ త‌గ్గడంతో మార్కెట్లో చికెన్ ధ‌ర‌లు త‌గ్గిపోయాయి.

About Author