మండలంలో తగ్గిన పంట విస్తీర్ణం..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: ఈ ఏడాది సరైన వర్షాలు కురవక ఖరీఫ్ సీజన్లో గత ఏడాది సాగైనా పంట విస్తీర్ణం కంటే రెండు వేల ఎకరాలు ఈ ఏడాది తగ్గినట్టు మండల వ్యవసాయ అధికారి హేమ సుందర్ రెడ్డి తెలిపారు భిన్నమైన వాతావరణం ఈ వర్షాకాలంలో రైతులకు పంట సాగుకు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది ఈ ఏడాది 18574 ఎకరాలు సాగు లో ఉన్నట్టు ఇందులో ముఖ్యమైన పంట .వరి. సోయా. మినుము .మొక్కజొన్న. పత్తి .ప్రధాన పంట కింద సాగు చేస్తున్నట్లు తెలిపారు మిర్చి పంట విస్తీర్ణం తగ్గినట్టు తెలిపారు.ముందస్తు రబి కింద జొన్న పంట సాగుకు సమాయత్తం అవుతున్నారు.