గంగలో తగ్గిన నీటి ప్రవాహం
1 min readపల్లెవెలుగు, వెబ్ రుద్రవరం: తెలుగు గంగ ప్రధాన కాలువలో నీటి ప్రవాహం తగ్గింది. వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి తెలుగు గంగ ప్రధాన కాలువకు రైతులు పంటలు సాగు చేసేందుకు సాగునీరు విడుదల చేయడం జరుగుతుంది. అలాగే గంగ ప్రధాన కాలువ ద్వారా కడప బ్రహ్మ సాగర్ కు సాగునీటిని అందివ్వడం జరుగుతుంది. తెలుగంగ ప్రధాన కాలువకు మొన్నటి వరకు సుమారు 5000 క్యూసెక్కులు సాగునీటిని గంగధికారులు విడుదల చేశారు. ప్రస్తుతం కడప బ్రహ్మ సాగర్ కు సాగునీరు అవసరం లేకపోవడంతో గంగ ప్రధాన కాలువకు 500 క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదల చేసినట్లు గంగ అధికారులు తెలిపారు. ఖరీఫ్ లో పంటలు సాగుచేసిన రైతులకు సాగునీటి అవసరం ఎక్కువగా లేనందువలన నీటి సామర్థ్యాన్ని తగ్గించామన్నారు. రబీలో సాగు చేసి పంటలకు అవసరాన్ని బట్టి గంగ ప్రధాన కాలువకు సాగునీటి సామర్ధ్యాన్ని పెంచే అవకాశం ఉన్నట్లు వారు తెలిపారు.