తగ్గిన బంగారం .. ఎంతంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : గ్లోబల్ మార్కెట్ల సంకేతాలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ పుంజుకున్న నేపథ్యంలో మంగళవారం దేశీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అటు మరో విలువైన మెటల్ వెండి ధర కూడా భారీగా తగ్గింది. ఈ వారం చివర్లో అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో వ్యాపారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. ఎంసీఎక్స్‌లో బంగారం10 గ్రాముల ధర రూ. 50,862గా ఉండగా, వెండి కిలో ధర 61,830కి చేరుకుంది. అటు హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్స్ పసిడి ధర 270 రూపాయలు తగ్గి 51,930గా ఉంది. వెండి కిలో ధర సుమారు 800 రూపాయలు తగ్గి రూ. 67770 పలుకుతోంది.