PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తగ్గిన గ్రామపంచాయతీ వేలంపాట ఆదాయం

1 min read

పల్లెవెలుగు వెబ్​ గడివేముల: గడివేముల పంచాయతీకి సంబంధించిన ఐదు రూములు ,సంత గేటు, బస్టాండ్ గేటు లకు వేలంపాట నిర్వహించగా ఈ సంవత్సరము ఆదాయం తగ్గిందని ఈఓ ఆర్ డి ఖాలిక్ భాష తెలిపారు. గురువారం నాడు మండల కేంద్రంలోని ఐదు పంచాయతీ రూములకు మరియు సంత గేటు, బస్టాండ్ గేటుకు 5 లక్షల 61000 రూపాయలు రూపాయలు హెచ్చుపడ్డదారులు పాడారు. గత సంవత్సరము ఐదు లక్షల 80వేల రూపాయల 500 రూపాయలు వేలం పాట పాడారని, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము 19000 రూపాయల ఆదాయం తగ్గిందని ఈఓ ఆర్డి కాలిక్ భాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమణమ్మ, ఎంపిటిసి బాలచెన్ని, పంచాయతీ కార్యదర్శి తారకేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

About Author