PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రియ‌ల్ ఎస్టేట్ లోకి తగ్గిన పెట్టుబ‌డులు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో సంస్థాగత పెట్టుబడులు జూన్‌ త్రైమాసికంలో 27 శాతం తగ్గాయి. 2022 ఏప్రిల్‌–జూన్‌ మధ్య 966 మిలియన్‌ డాలర్లు పెట్టుబడులుగా వచ్చాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం సంస్థాగత పెట్టుబడులపై ఉన్నట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్‌ఎల్‌ ఇండియా తెలిపింది. క్రితం ఏడాది జూన్‌ త్రైమాసికంలో రియల్టీలో సంస్థాగత పెట్టుబడులు 1,329 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఈ మేరకు జేఎల్‌ఎల్‌ ఒక నివేదిక విడుదల చేసింది. ఏప్రిల్‌–జూన్‌ కాలంలో కార్యాలయ స్థలాల విభాగంలోకి సంస్థాగత పెట్టుబడులు 652 మిలియన్‌ డాలర్లకు పెరిగాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో పెట్టుబడులు 231 మిలియన్‌ డాలర్లుగానే ఉన్నాయి. హౌసింగ్‌ విభాగంలోకి సంస్థాగత పెట్టుబడులు 60 మిలియన్‌ డాలర్లకు తగ్గాయి. ఏడాది క్రితం ఇదే కాలంలో ఇవి 78 మిలియన్‌ డాలర్ల మేర ఉన్నాయి. రిటైల్‌ రియల్‌ ఎస్టేట్‌లో సంస్థాగత పెట్టుబడులు గణనీయంగా తగ్గి 51 మిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 278 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.

                           

About Author