ప్రజాభిప్రాయ సేకరణ
1 min read– బనగానపల్లె అసెంబ్లీ ఛార్జ్ షీట్ ఇంచార్జీ శివకృష్ణ యాదవ్ ప్రజాభిప్రాయ
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలోభారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న తీరుపై ప్రజా ఛార్జ్ షీట్ కార్యక్రమంలో భాగంగా బనగానపల్లె తహసిల్దార్ కార్యాలయం ఎదురుగా బిజెపి ఓబీసీ జిల్లా అధ్యక్షులు బనగానపల్లె అసెంబ్లీ ఛార్జ్ షీట్ ఇంచార్జీ శివకృష్ణ యాదవ్ గారి అధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ మరియు వారి వినతులను స్వీకరించడం జరిగింది ఈ సంద్భంగా శివకృష్ణ యాదవ్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది బీసీ ఎస్సీ ఎస్టీ సామజిక వర్గాలకు సంభందించిన సబ్ ప్లాన్ నిధుల విషయంలొ ఈ ప్రభుత్వం పూర్తిగా నష్టపరిచిందని ఆయన అన్నారు. అదేవిధంగా నియోజకవర్గం లో అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రజా ఛార్జ్ షీట్ వినతులు అందాయని వాటిపై కూడా జిల్లా ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసకెళతానని అలాగె ప్రసిద్ది గాంచిన బెలుం గుహలు రవ్వల కొండ లాంటి ప్రదేశాల్లో అక్రమ మైనింగ్ చేస్తూ సహజ సిద్ధమైన వనరులను దుర్వినియోగం చేస్తున్నారు అని అన్నారు ఇలా అనేక సమస్యల పై ప్రజలతో కలిసి ప్రజా ఉద్యమం చేపడతామని అన్నారు కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి యాదగిరి. చాందిని బిజెపిఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సీతారామయ్య కొనేటి వేణు యాదవ్ బీజే వై ఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కిసాన్ మొర్చా జిల్లా ఉపధ్యక్షుడు శివరామిరెడ్డి. మండల నాయకులు. చిన్నయ్య యాదవ్ బాలవెంకటేశ్వర్లు సురేష్ మల్లికార్జున కంభయ్య యాదవ్ రవికుమార్. కృష్ణ గోపాల్ జయరమిరెడ్డి వలి నాగార్జున తదితర బిజెపి నాయకులు పాల్గొన్నారు.