టీచర్లను అవమానించే చర్యలు మానుకోండి – ఆపస్ డిమాండ్
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: గత సంవత్సరం జరిగిన పదవ తరగతి పరీక్షలు తప్పులు చేసిన టీచర్లను సస్పెండ్ చేయడం ఇంక్రిమెంట్లు కట్ చేయడం వారిపై కేసులు పెట్టడం లాంటి పనిష్మెంట్స్ ఇవ్వడం జరిగిందని, ఇప్పుడు మరలా వారిని పదవ తరగతి పరీక్షల సమయంలో పోలీస్ స్టేషన్లు, తహసీల్దార్ కార్యాలయాల్లో నిర్బంధంగా ఉంచుతామని నిర్ణయించడం ఉపాధ్యాయ లోకాన్ని అవమానించడమే అని, ఇది ఎంత మాత్రము ఆమోదయోగ్యమైన చర్య కాదని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సిహెచ్ శ్రావణ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్ బాలాజీ ఒక ప్రకటనలో కోరారు.అలాగే ఆర్టికల్ 21 (2). ప్రకారం ఒక నేరానికి రెండుసార్లు శిక్ష విధించరాదని గుర్తు చేశారు. ఇలాంటి చర్యలు తీసుకుంటే ప్రత్యక్ష కార్యాచరణ కు పునుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.